Breaking News
Home / సినిమా వార్తలు / ఒకే సారి రెండు చిత్రాలకు ముహూర్తం పెట్టనున్న” నందమూరి బాలకృష్ణ “
balayya gopichand

ఒకే సారి రెండు చిత్రాలకు ముహూర్తం పెట్టనున్న” నందమూరి బాలకృష్ణ “

టాలీవుడ్ దిగ్గజం , నటన లో కాని డైలాగ్స్ చెప్పడం లో కానీ ఎన్నటికీ తిరుగులేని హీరో ” నందమూరి బాలకృష్ణ ” రాజసానికి పెట్టింది పేరు.
ఫ్యాక్షనిజం సినిమాల లో తనదంటూ ఒక ముద్ర వేసుకున్నాడు బాలయ్య. సింహ ,లెజెండ్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాల తో అటు బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ మరియు రికార్డుల మోత మోగించాడు మన హీరో బాలయ్య .

తెలుగు ఫిలిం ఇండస్ట్రీ లో యాక్షన్ మరియు మాస్ సినిమాల గురించి మాట్లాడితే బాలకృష్ణ తప్ప మరే ఇతర హీరో లు చేయలేరు అనే స్టాండర్డ్ ని సెట్ చేశాడు మన నటసింహం బాలకృష్ణ.కేవలం సినిమాల్లో మాత్రమే కాదు రాజకీయాల్లో కూడా ఎదురులేని మనిషి.

balayya
balayya| anil ravipudi| gopichand|

దర్శకుడు బోయపాటి శ్రీను తో బాలయ్య సినిమా చేస్తున్నాడు అంటే అభిమానులకి ఇంక పండగే. తాజా గ బోయపాటి తో కలసి చేసిన సినిమా ట్రైలర్ విడుదలయిన విషయం తెలిసిందే.ఇదే కాకుండా తాజా గ బాలయ్య కొత్త గెటప్ మరియు పవర్ ఫుల్ డైలాగ్ తో సినిమా పేరు “అఖండ ” ని టీజర్ ద్వారా విడుదల చేశారు. ఇది పూర్తిగ మాస్ కమర్షియల్ చిత్రం.

ఈ సినిమాలో బాలయ్య సరసన హీరోయిన్ గ ప్రగ్య జైస్వాల్ నటిస్తోంది. హీరో శ్రీకాంత్ కూడా ఒక పాత్ర చేస్తున్నారు. నవీన్ చంద్ర కూడా కీలక పాత్రా లో నటిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి నిర్మాత గ మిర్యాల రవీందర్ రెడ్డి , ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ లో రూపొందుతోంది.ఆర్ట్ డైరెక్టర్ A s ప్రకాష్ , సినిమాటోగ్రాఫర్ రామ్ ప్రసాద్ . మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ థమన్ స్వరాలు సమకూర్చారు. ఈ సినిమా ని ఈ సంవత్సరం మే 28 న రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు.

ఇది ఇలా ఉండగా రీసెంట్ గ హిట్ అయినా రవితేజ చిత్రం “క్రాక్ ” ఈ చిత్రానికి దర్శకుడు “గోపీచంద్ మలినేని” . డాన్ శీను , బలుపులాంటి మాస్ హిట్ సినిమాలు తీసిన గోపీచంద్ మలినేని ఈ సారి నందమూరి బాలకృష్ణ తో కలిసి మైత్రి మూవీస్ బ్యానర్ లో ఒక భారీ బడ్జెట్ సినిమా ప్లాన్ చేశారు.వచ్చే సంక్రాంతికి ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నారు దర్శకుడు గోపీచంద్ మలినేని.పై చిత్రంలో అతను దర్శకుడు ప్రకాశం జిల్లాలోని వేటపాలంలో 100 సంవత్సరాల పురాతన గ్రంథాలయంలో కూర్చుని ఉన్నాడు. తాను చేయబోయే సినిమా స్క్రిప్టు కోసం పరిశోధన ను ప్రారంభించాడు .

balayya anil ravipudi

గోపీచంద్ మలినేని తో సినిమా చేసిన వెంటనే, “అనిల్ రావిపూడి ” దర్శకత్వం లో, దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బానర్ లో ఇంకో చిత్రం చేయనున్నారు బాలకృష్ణ . అనిల్ రావిపూడి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కామెడీ,యాక్షన్, ఫామిలీ సెంటిమెంట్ ఇలా అన్ని కలగలిపిన సినిమాలు తీయడం లో అనిల్ రావిపూడి సిద్ధహస్తుడు. పటాస్ , రాజా ది గ్రేట్ , సరిలేరు నీకెవ్వరూ , F2 లాంటి మంచి హిట్ సినిమాలు తీశారు. వచ్చే ఏడాది కి ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు సమాచారం.

Check Also

mahesh trivikram | movieif

త్రివిక్రమ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ఎందుకు చింత పడుతున్నారు?

సినిమాలతో ప్రయోగాలు చేసే టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో, సూపర్ స్టార్ మహేష్ బాబు ఒక్కరే. ఆయన యొక్క ఫ్యాన్ ఫాలోయింగ్ …