Breaking News
Home / సినిమా టీజర్ / “గంగూబాయి ఖతియవాడి ” తో మన ముందుకు వచ్చిన అలియా భట్
gangubai | movieif

“గంగూబాయి ఖతియవాడి ” తో మన ముందుకు వచ్చిన అలియా భట్

బాలీవుడ్ లో ముందు వరుసలో దూసుకెళ్తున్న హీరోయిన్లలో అలియా భట్ కూడా ఒకరు. అలియా భట్ ఎంచుకునే మూవీస్ అన్ని కూడా ఒక రకమైన ప్రత్యేకతతో ఉంటాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇపుడు అలియా తీయబోతున్న మూవీ కూడా అలాంటి కోవలోకే వస్తుంది. అదే సంజయ్ లీల భన్సాలీ దర్శకత్వంలో రాబోతున్నటువంటి “గంగూబాయి ఖతియవాడి”.

ఇటీవలే మన ముందుకి వచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యొక్క మూవీ వకీల్ సాబ్. ఆ సినిమా థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శించబడుతోందని మనకి అందరికి తెలిసిన విషయమే.

ఈ వకీల్ సాబ్ మూవీ లో అలియా తీయబోతున్న “గంగూబాయి ఖతియవాడి” మూవీ యొక్క టీజర్ రావడం జరిగింది. తెలుగు లో కూడా ఈ సినిమా రాబోతుండడం గమనార్హం.

ఈ సినిమా టీజర్ ని మనం గమనిస్తే, ఇందులో మనం ఎన్నడూ చూడని విధంగా అలియా భట్ ఒక వేశ్యపాత్రలో కనిపిస్తుంది. ఆమె ఒక వ్యక్తి దగ్గర పనిచేస్తూ ఉంటుంది. అతను ఎవరికి భయపడడు అలాగే ఎవరికి తల వొంచడు.

టీజర్ మొత్తానికి అలియా భట్ పాత్ర చాల ప్రత్యేకంగా కనిపిస్తుంది. టీజర్ చివరిలో అలియా చెప్పిన డైలాగ్స్ ప్రధాన ఆకర్షణగా కనిపిస్తాయి అనడంలో అతిశయోక్తి లేదు.

అలియా భట్ యొక్క వస్త్ర ధారణ మరియు తన పాత్ర యొక్క తీరు, ఆమె తీయబోతున్న మూవీ సమయం అన్ని కరెక్ట్ గ సెట్ అయ్యాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ విషయాలే టీజర్ లో చూపరులని కట్టిపడేస్తాయి.

హుస్సేన్ జైదీ రాసిన “గంగూబాయి” పుస్తకం లో ఉన్నటువంటి “మాఫియా క్వీన్స్ అఫ్ ముంబై” అనే ఒక పార్ట్ ఆధారంగా తీస్తున్న ఈ చిత్రానికి అలియా ద్వారా ప్రధాన పాత్ర చేయించడం ఆమె కెరీర్ లోనే ప్రధాన అంశం.
ఇందులో సంజయ్ లీల భన్సాలీ తన టాగ్ లైన్ కి ఏమాత్రం తగ్గకుండా మంచి విలువలతో, అదే విధంగా సాంకేతిక పరిజ్ఞానం తో కూడిన చిత్ర ప్రదర్శన ఈ మూవీ లో మనకి కనిపిస్తుంది.

టాలీవుడ్ లో తొలిసారిగా RRR ద్వారా అరంగ్రేటం చేయబోతున్న అలియా భట్ ని, సంజయ్ లీల భన్సాలీ తన “గంగూబాయి ఖతియవాడి” చిత్రం ద్వారా అలియా ని ముందుగానే తెలుగు ఇండస్ట్రీ కి పరిచయం చేయాలనీ, శర వేగంగా పనులు చేస్తున్నారని కూడా వార్తలు వస్తున్నాయి.

RRR మూవీలో రామ్ చరణ్ పక్కన హీరోయిన్ గా నటిస్తున్న అలియా భట్ తొలిసారిగా తెలుగు సినిమాలో సందడి చేయనుంది. ఇప్పటికే బాలీవుడ్ లో ఒక రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న అలియా భట్ ఇపుడు తెలుగులో తన ప్రయాణాన్ని ఎలా మొదలు పెడుతుందో అని విశ్లేషకులు అభిప్రాయం పడుతున్నారు.

ఇండియా మొత్తం మీద అన్ని మూవీ థియేటర్స్ లో జులై 30 న విడుదల అవ్వబోతున్న ఈ “గంగూబాయి ఖతియవాడి” మూవీ ని జయంతిలాల్ గడ మరియు సంజయ్ లీల భన్సాలీ నిర్మించడం జరిగింది.

 

Check Also

balck widow | movieif

SCARLETT JOHANSSON యొక్క “బ్లాక్ విడో” అధికారిక ట్రైలర్

బ్లాక్ విడో మార్వెల్ సినిమాల గొప్ప మహిళా యోధురాలు. సినిమాల్లో ఆమె పేరు నటాలియా రోమనోఫ్. ఆమె గురించి ఒక …