Breaking News
Home / సినిమా వార్తలు / త్రివిక్రమ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ఎందుకు చింత పడుతున్నారు?
mahesh trivikram | movieif

త్రివిక్రమ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ఎందుకు చింత పడుతున్నారు?

సినిమాలతో ప్రయోగాలు చేసే టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో, సూపర్ స్టార్ మహేష్ బాబు ఒక్కరే. ఆయన యొక్క ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా అలాగే ఉంటుంది.

ఎంత ఎత్తుకి ఎదిగినా వొదిగి ఉండాలి అంటారు. మహేష్ బాబు ని చూస్తే అది నిజమే అనిపిస్తుంది. మహేష్ బాబు మొదటగా సినిమాలలోకి వచ్చినపుడు సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా ప్రిన్స్ మహేష్ బాబు అని ముద్ధుగా పిలుచుకునే వారు.

అప్పటి నుండి అంచెలంచెలుగా మహేష్ బాబు తన నటనతో అమితమైన అభిమానులని సొంతం చేస్కోవడం జరిగింది. అతని నటనలో అందరూ తమ పక్క ఇంటి కుర్రాడితో మాట్లాడినట్లు భావించారు అనడంలో ఎలాంటి సందేహం లేదు.

mahesh trivikram combo
mahesh trivikram combo | movieif

అలా, అతని ప్రతిభతో కొంత కాలంలోనే తన తండ్రి బిరుదు అయినటువంటి “సూపర్ స్టార్” ని తన పేరు ముందు ఉంచుకునే అవకాశాన్ని పొందగలిగారు సూపర్ స్టార్ మహేష్ బాబు.

అలాంటి మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు “భరత్ అనే నేను”, “మహర్షి”, “సరిలేరు నీకెవ్వరూ” వంటి విభిన్న కథా రచనలు కలిగిన చిత్రాలలో నటించడమే కాకుండా, బ్లాక్ బస్టర్ హిట్స్ సొంతం చేస్కుని తన సత్తాని చాటారు.

వీటి తర్వాత మనకందరికీ తెల్సిన విధముగా “సర్కారి వారి పాట” ద్వారా మన ముందుకి రాబోతున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఈ “సర్కారి వారి పాట” చిత్రానికి పరశురామ్ దర్శకుడిగా పని చేస్తున్నారు.

ఇప్పటికే పరశురామ్ తీసే చిత్రాలు హిట్స్ నుండి బ్లాక్ బస్టర్ హిట్స్ అవుతున్న సంగతి అందరికి తెలుసు. ఉదాహరణకి కొద్దీ రోజుల ముందే విజయదేవర కొండ కి “గీతా గోవిందం” చిత్రం రూపంలో బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చారు దర్శకుడు పరశురామ్.
ఈ పరశురామ్ మూవీ తర్వాత RRR మూవీ ని తీస్తున్న S.S. రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబుతో మూవీ తీయబోతున్నట్లు కొన్ని రకాల వార్తలు సోషల్ మీడియా లో కొట్టడం జరిగింది. చివరకి అదే నిజమని రాజమౌళి గారు స్పష్టం చేయడంతో మన త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఆలోచనలో పడ్డారు.

mahesh trivikram ntr
mahesh trivikram ntr | movieif

RRR మూవీలో మల్టీ స్టారర్ తో మన ముందుకి తీస్కుని రాబోతున్నారు దర్శకుడు S.S.రాజమౌళి గారు. ఆయన చేసే ప్రతి మూవీలో ఒక కొత్త రకమైన కథతో ప్రేక్షకులని ఆశ్చర్యంతో ముంచెత్తుతారు. ఈ RRR మూవీలో జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీం గాను మరియు రామ్ చరణ్ అల్లూరి సీతారామ రాజు గాను నటించబోతున్నారు.

ఎప్పటినుండో సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా తీయాలనే కోరికతో ఉన్న త్రివిక్రమ్ గారికి, ఈసారి కూడా అది జరగకపోవచ్చనే అభిప్రాయం ఏర్పడినట్లు స్పష్టంగా అర్థమవుతోంది.

అందుకే మహేష్ తో సినిమా డేట్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని త్రివిక్రమ్ గారు భావిస్తున్నారు.

ఏది ఏమైనప్పటికి మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో మూవీ చూడాలని అభిమానులు కూడా పెద్ద ఎత్తున పడి గాపులు కాస్తున్నారు.

Check Also

balayya gopichand

ఒకే సారి రెండు చిత్రాలకు ముహూర్తం పెట్టనున్న” నందమూరి బాలకృష్ణ “

టాలీవుడ్ దిగ్గజం , నటన లో కాని డైలాగ్స్ చెప్పడం లో కానీ ఎన్నటికీ తిరుగులేని హీరో ” నందమూరి …