Breaking News
Home / సినిమా టీజర్ / మాస్ మహారాజా రవి తేజ యొక్క “ఖిలాడి” మూవీ టీజర్ విడుదలైంది.
khiladi | movieif

మాస్ మహారాజా రవి తేజ యొక్క “ఖిలాడి” మూవీ టీజర్ విడుదలైంది.

టాలీవుడ్ హీరోలలో మాస్ అనే పేరు చెప్పగానే గుర్తుకు వచ్చే హీరో రవితేజ. రవి తేజ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి మన అందరికి తెల్సిన విషయమే. ఎంతో శ్రమ పడి తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక మాస్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కొద్ది మంది నటులలో రవి తేజ కూడా ఒకరు. అలంటి రవి తేజ ఎన్నో సమస్యలని అధిగమిస్తూ ఈరోజు ఒక మంచి పొజిషన్ లో ఉండడం మన అందరికి కూడా సంతోషాన్ని కలిగించే విషయం.

అందుకే అతన్ని మాస్ మహారాజ అని కూడా పిలుస్తారు. ఇటీవలే విడుదలైన క్రాక్ మూవీ తో తన విజయ ఢంకా మ్రోగించారు రవితేజ. అదే ఊపులోనే మల్లి ఇంకొక మూవీ తీయడంలో బిజీ అయిపోయారు రవితేజ. అదే ఇపుడు మనం డిస్కస్ చేయబోతున్న ఖిలాడీ మూవీ.

అభిమానులు అలాగే కుటుంభం ప్రేక్షకులు భారీగా ఉన్నటువంటి రవితేజ, ఆ స్పీడ్ ని తగ్గించుకోకూడదనే ఉదేశ్యంతో శర వేగంతో ఈ కిలాడీ మూవీ ని పూర్తి చేయడం జరిగింది. ఈ చిత్రాన్ని నిర్మించడంలో ఎలాంటి ఆలస్యం చేయని చిత్ర యూనిట్ ఈ మూవీ టీజర్ ని ఉగాది పండుగ లోపు రిలీజ్ చేయాలనే వారి మాటని నిలబెట్టుకున్నారు.

ఎన్నో భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ ఖిలాడీ మూవీ టీజర్ ఆ అంచనాలకి ఏమాత్రం తగ్గకుండా రవితేజ మాస్ ఇమేజ్ ని కూడా పెంచేలాగా ఉంది అందులో ఎలాంటి సందేహం లేదు.

దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ తో టీజర్ బాక్గ్రౌండ్ స్కోర్ మారిపోయింది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. టీజర్ మొత్తం మొదటి నుండి చివరి వరకు కూడా ఎలాంటి డైలాగ్స్ లేకుండా కేవలం బ్యాక్ గ్రౌండ్ సౌండ్స్ తో మంచి విసువల్ ఎఫెక్ట్స్ తో ఎంతో ఆకట్టుకునేలా, మరింత థ్రిల్లింగ్ గా తీర్చిదిద్దారు.

అంతే కాకుండా తమిళ్ మూవీ స్టార్ అండ్ ఫామిలీ స్టార్ ఐన అర్జున్ ఇందులో నటిస్తుండడం గమనార్హం.

ఈ టీజర్ లో మనం గమనిస్తే రవితేజ రెండు పాత్రలలో కనిపించబోతున్నట్లు అర్థమవుతోంది. టీజర్ న ఐ బట్టి అందులో ఒక పాత్ర గ్యాంగ్ స్టర్ అయ్యిండొచ్చనే అభిప్రాయం మనకి కలగక తప్పదు.

టీజర్ లో ఇంటరెస్టింగ్ పార్ట్ ఏంటంటే రవితేజ కొందరిని వేటాడుతూ ఉంటాడు. అది కూడా ఒక సుతి తీస్కుని వెంట పడటం మనం గమనిస్తాం. ఇది చాల భయంగాను, కొంత థ్రిల్లింగాను ఉండబోతుందని అర్థమవుతోంది.

మే 28న విడుదల అవ్వబోతున్న ఈ మూవీ పైన ఇపుడు రిలీజ్ చేసిన టీజర్ మరింత ఎక్కువ చూపించబోతుందని విశ్లేషకులు చెప్తున్నారు.

జి.కే.విష్ణు సినిమాటోగ్రఫీలో వచ్చిన ఈ సినిమా, మరింత ఆసక్తి కరంగాను అభిమానులకి మరొక మాస్ ఎంటెర్టైన్మెట్ అనే చెప్పాలి.

పెన్ స్టూడియోస్ మరియు A స్టూడియోస్, వారు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్న మూవీ ఈ ఖిలాడీ.
ఈ ఖిలాడీ మూవీ ఎలా ఉండబోతుంది అనేది తెల్సుకోవాలంటే విడుదల అయ్యేవరకు వేచి ఉండక తప్పదు.

Check Also

balck widow | movieif

SCARLETT JOHANSSON యొక్క “బ్లాక్ విడో” అధికారిక ట్రైలర్

బ్లాక్ విడో మార్వెల్ సినిమాల గొప్ప మహిళా యోధురాలు. సినిమాల్లో ఆమె పేరు నటాలియా రోమనోఫ్. ఆమె గురించి ఒక …