Breaking News
Home / సినిమా వార్తలు / టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమా విడుదల ఆగిపోయిందా?
acharya postponed

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమా విడుదల ఆగిపోయిందా?

మహమ్మారి పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, # ఆచార్య చిత్రం మే 13 న విడుదల ఆపడం జరిగింది.

పరిస్థితి సాధారణమైన తర్వాత కొత్త విడుదల తేదీ ప్రకటించబడుతుంది.

ముసుగు ధరించండి, ఇంట్లో ఉండండి & సురక్షితంగా ఉండండి!
మెగాస్టార్ చిరంజీవి అతని తనయుడు రాంచరణ్ కలిసి నటించిన చిత్రం “ఆచార్య” ను వాయిదా వేసినట్లు  మేకర్స్ మంగళవారం ప్రకటించారు.

కొరటాల శివ దర్శకత్వం వహించిన “ఆచార్య” సినిమా లో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ , రామ్ చరణ్ సరసన పూజ హెగ్డే నటిస్తున్నారు.

రాంచరణ్ ఇంతకుముందు తండ్రి తో కలసి కొన్ని సినిమాలు చేసినప్పటికి, అందులో కేవలం గెస్ట్ రోల్ చేసాడు. ఇప్పుడు ఆచార్య లో మాత్రం పూర్తిగ సినిమా మొత్తం తండ్రి పక్కన చేయబోతున్నారు.

acharya ram charan
acharya ram charan

ప్రకృతి వనరుల పరిరక్షణకు తోడు గా ఉండే ఒక వడ్రంగి నక్సలైట్ గా ఎందుకు మారాడు అనే అంశం పై ఈ కథ సాగబోతోందని దర్శకుడు కొరటాల శివ స్పష్టం చేశారు.

భారతదేశంలో COVID-19 కేసులు వేగంగా పెరుగుతున్నాయి మరియు వైరస్ యొక్క రెండవ వేవ్ నిజంగా సినీ పరిశ్రమను ప్రభావితం చేస్తుంది.  అనేక మంది ప్రముఖులు కూడా COVID-19 కు పాజిటివ్ కు గురయ్యారు మరియు చాలామంది ప్రాణాలు కూడా కోల్పోయారు.

 అందువల్ల, ఆచార్య మూవీ మేకర్స్ పరిస్థితి బాగుపడే వరకు దాని విడుదల కోసం వేచి ఉండాలని నిర్ణయించుకున్నారు.

ప్రస్తుతం కరోనా కారణంగా తెలంగాణ లో సినిమా థియేటర్లు మూసివేయడం తెలిసిందే. దీంతో నిర్మాతలు మరియు డిస్ట్రిబ్యూటర్ లు మళ్ళీ ఎప్పుడు సినిమా హాళ్లు తెరుస్తారా అని చాలా ఓపికగా ఎదురుచూస్తున్నారు.

ఈ చిత్రాన్ని జులై మధ్యలో లేదా ఆగస్ట్ ఆరంభం లో విడుదల చేయడానికి చర్చలు కొనసాగించారు.

acharya postponed

మెగాస్టార్ చిరంజవీ, మెలోడీ బ్రహ్మ “మణిశర్మ”తో కలసి చాలా ఏళ్ళ తర్వాత మళ్ళీ ఈ ఆచార్య సినిమాకు పని చేస్తున్నారు. మొన్న రిలీజ్ అయిన టీజర్, ఒక పాట కి ఇచ్చిన మ్యూజిక్ లో తన స్టైల్ లో మళ్ళీ ప్రేక్షకుల్ని మైమరపించారు. మణిశర్మ  స్వరాలు అందించటం తో ఈ సినిమా పై అంచనాలు ఇంకా ఎక్కువ అవుతున్నాయి.

ఉగాది పండుగ సందర్భంగా ఈ సినిమా లో రాంచరణ్ కి సంబంధించిన ఒక పోస్టర్ ని మూవీ మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో రాంచరణ్ హీరోయిన్ పూజాహెగ్డే తో ఒక రొమాంటిక్ స్టిల్ లో కనిపించారు. ఈ పోస్టర్ గురించి ఇంస్టాగ్రామ్ లో ఇలా రాసారు “సిద్ధ లవ్స్ నీలంబరి” ఉగాది శుభాకాంక్షలు నీలాంబరి అని తన విషెస్ చెప్పారు రాంచరణ్.

Pic Talk: Presenting Unseen Side Of Acharya's Siddha

హీరోయిన్ పూజాహెగ్డే కూడా ఇదిగో “సిద్ధ ప్రేమతో నీలాంబరి” అందరికి ఉగాది శుభాకాంక్షలు అని తెలియచేసారు.
Acharya's romantic poster skips release date | Telugu Cinema
ఆచార్య సినిమా లో  సోనుసూద్, జిష్హు సెంగుప్త, సౌరవ్ లోకేష్, కిషోర్, తనికెళ్ళ భరణి, రెజినా కాసాండ్రా , అజయ్ మరియు సంగీత క్రిష్ ముఖ్య పాత్రలు పోషించారు.

కొనిడెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాటినీ ఎంటర్టైన్మెంట్ ఆధ్వర్యంలో రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Check Also

mahesh trivikram | movieif

త్రివిక్రమ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ఎందుకు చింత పడుతున్నారు?

సినిమాలతో ప్రయోగాలు చేసే టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో, సూపర్ స్టార్ మహేష్ బాబు ఒక్కరే. ఆయన యొక్క ఫ్యాన్ ఫాలోయింగ్ …