Breaking News
Home / సినిమా వార్తలు / రికార్డుల విషయం లో “తగ్గేదెలే ” అంటున్న పుష్ప హీరో అల్లు అర్జున్
pushpa new records

రికార్డుల విషయం లో “తగ్గేదెలే ” అంటున్న పుష్ప హీరో అల్లు అర్జున్

టాలీవుడ్ ఐకానిక్ మరియు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ , దర్శకుడు సుకుమార్ దర్శకత్వం లో రాబోతున్న కొత్త  చిత్రం “పుష్ప”.
ఈ సినిమా రిలీజ్ కోసం వైఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అభిమానులకోసం చిత్ర బృందం ఏప్రిల్ 7 న స్టైలిష్ స్టార్ “అల్లుఅర్జున్” పుట్టినరోజు సందర్భాంగ ఈ సినిమా కు సంబంధించిన ఫస్ట్ లుక్ టీజర్ ను  విడుదల చేసారు.
 ఈ సినిమా లో అల్లు అర్జున్  కొత్త లుక్ లో కనిపించడం  అభిమానులుకు కన్నూల పండుగ గా నిలిచింది. ఈ టీజర్ లో అల్లు అర్జున్ “తగ్గేదెలే” అనే  డైలాగ్ తో టీజర్ ని ముగించడం జరిగింది. సాదరంగా రికార్డు ల విషయం లో అల్లు అర్జున్ గురించి పెద్దగా చెప్పక్కర్లేదు.
pushpa new record
పుష్ప సినిమా టీజర్ టాలీవుడ్ లొనే ఒక కొత్త రికార్డ్ ను సృష్టించింది. మూడు వారాల్లో  యూట్యూబ్ లో ఏకంగా  50 మిలియన్ వ్యూస్ రావడం జరిగింది.  మిగతా సినిమాలతో పోలిస్తే చాలా గట్టి పోటీ ని  ఇచ్చింది. టాలీవుడ్ లో ఒక సరికొత్త రికార్డును సృష్టించింది.
ఈ సందర్భంగా మేకర్స్ ప్రత్యేక పోస్టర్‌ను కూడా ఆవిష్కరించారు మరియు ఇది పైన పేర్కొన్న రికార్డును ధృవీకరిస్తుంది.
అల్లు అర్జున్ ఈ చిత్రం లో “పుష్ప రాజ్” గా ఒక ఊర మాస్ రూపం లో పూర్తి యాక్షన్ విజువల్స్ తో పవర్ ప్యాక్డ్ గా కనిపించాడు.
Pushpa teaser: Allu Arjun impresses, Rashmika Mandanna says 'you are fire on screen' | Entertainment News,The Indian Express
1 నిమిషం 16 సెకన్ల టీజర్ యాక్షన్-ప్యాక్డ్ ఎంటర్టైనర్లో ఒక స్నీక్ పీక్ ఇస్తుంది మరియు అల్లు అర్జున్ ను లారీ డ్రైవర్ గా మాస్ లుక్ లో కనిపించాడు .
సుకుమార్ దర్సకత్వం ట్రిక్స్, అల్లుఅర్జున్ బాడీ లాంగ్వేజ్ , యాక్షన్ స్టంట్ లు ఆకర్షణ గా నిలిచాయి.  మ్యూజిక్ డైరెక్టర్ DSP (దేవి శ్రీ ప్రసాద్) సెన్సేషనల్ షల్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ లు ఈ టీజర్ కి ప్రధాన కారణాలుగా నిలిచాయని చెప్పచ్చు .
శేషాచలం అడవుల్లో ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంగా ఈ చిత్రం తెరకెక్కబోతోంది.
అల్లు అర్జున్‌కు విలన్ గా మలయాళ నటుడు ఫహద్ ఫాసిల్ నటించారు.  నటి రష్మిక మండన్న ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. జగపతి బాబు, ప్రకాష్ రాజ్, ధనంజయ్, సునీల్, హరీష్ ఉతామన్, వెన్నెల కిషోర్ మరియు అనసూయ భరద్వాజ్ తదితరులు ఉన్నారు.
ఈ చిత్రాన్ని ముత్తాంశెట్టి మీడియాతో అనుబంధంగా ఉన్న మైత్రి మూవీస్ పార్టనర్ నవీన్ యెర్నేని మరియు వై.రవిశంకర్ నిర్మించారు. సుకుమార్ దర్శకత్వం వహించిన పాన్-ఇండియా చిత్రం ఇది.
ఆస్కార్ విజేత రేసుల్ పూకుట్టి సౌండ్ డిజైనర్, సౌండ్ ఎడిటర్ మరియు ఆడియో మిక్సర్ కూడా ఈ చిత్రం కోసం పనిచేస్తున్నారు. మిరోస్వా కుబా బ్రోసెక్ సినిమాటోగ్రఫీ విభాగానికి బాధ్యత వహించారు.
Official: Allu Arjun Pushpa release date - tollywood
ఈ సినిమా తెలుగు, తమిళం, హిందీ,  కన్నడ మరియు మలయాళం ఇలా ఒకేసారి 5 భాషల్లో రిలీజ్ చేస్తున్నారు.
ఈ సినిమా ఏప్రిల్ 13న, 2021 రేలీజ్ చేయడానికి సిద్ధం చేస్తున్నారు.

Check Also

mahesh trivikram | movieif

త్రివిక్రమ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ఎందుకు చింత పడుతున్నారు?

సినిమాలతో ప్రయోగాలు చేసే టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో, సూపర్ స్టార్ మహేష్ బాబు ఒక్కరే. ఆయన యొక్క ఫ్యాన్ ఫాలోయింగ్ …