Breaking News
Home / సినిమా టీజర్ / ఇపుడే చూడండి సంపూర్ణేష్ బాబు నటించిన “బజార్ రౌడీ” మూవీ టీజర్
sampoornesh babu | movieif

ఇపుడే చూడండి సంపూర్ణేష్ బాబు నటించిన “బజార్ రౌడీ” మూవీ టీజర్

సంపూర్ణేష్ బాబు, ఈ పేరు వినగానే అందరికి 2015 లో విడుదల అయిన “హృదయ కాలేయం” సినిమాలో అతను చేసిన కొత్త ప్రయోగాలే గుర్తొస్తాయి. ఎలాంటి స్టార్ డమ్ లేకుండా వచ్చి, అతని లో ఉన్న టాలెంట్ ద్వారా ప్రేక్షకులని కడుపుబ్బ నవ్వించడమే కాకుండా, హిట్ కొట్టారు సంపూర్ణేష్ బాబు గారు.

దీని ద్వారానే అతను తన మొదటి మూవీ ద్వారానే ఉత్తమ నటుడిగా కామిక్ రోల్ లో అవార్డు ని పొందడం జరిగింది.

ఈ బజార్ రౌడీ మూవీ ఒక పేరడీ చిత్రం. ఇందులో సంపూర్ణేష్ బాబు తన నటనతో అందరిని అలరించడంలో ఎలాంటి సందేహం లేదని చిత్ర వర్గాలు చెబుతున్నాయి.

“హృదయ కాలేయం” మూవీ లో అతని ప్రతిభ ని చూసిన మంచు విష్ణు సంపూర్ణేష్ బాబుతో ఒక మూవీ తీయాలని తీర్మానించుకున్నారు. అనుకున్నదే తడవుగా సంపూర్ణేష్ బాబు ని హీరో గ పెట్టి “కొబ్బరి మట్ట” అనే ఒక కామెడీ మూవీ జరిగింది.

అనుకున్న స్థాయిలో ఈ “కొబ్బరి మట్ట” మూవీ హిట్ అవ్వకపోయినా, కానీ అందులో నటనతో ఆకట్టుకున్న సంపూర్ణేష్ బాబుకి మంచి మార్కులే పడ్డాయి.

దాదాపు నెలన్నర నుండి ఈ “బజార్ రౌడీ” మూవీ కోసం కష్టపడుతూ ఉన్నారు బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు గారు.

ఈ మూవీలో సంపూర్ణేష్ బాబుతో పాటు షాయాజీ షిండే, పృథ్వి, నాగినీడు, షఫీ, సమీర్, మణిచందన, నవీన్ మరియు పద్మావతి నటించడం జరిగింది.

ఇపుడు విడుదల అయిన ఈ “బజార్ రౌడీ” టీజర్ ప్రేక్షకులని బాగా ఆకర్షించింది. అలాగే ఈ మూవీ ని OTT ప్లాటుఫార్మ్స్ లో కూడా తీస్కుని రావాలని చిత్ర బృందం భావిస్తోంది.

ఈ మూవీ పనులు శర వేగంగా జరుగుతున్నాయి. ఇందులో సంపూర్ణేష్ బాబు ని భారీ స్థాయిలో చూపించాలని షూటింగ్ కూడా భారీ లొకేషన్స్ లో తీయడం జరిగింది.

ఈ సంవత్సరం లో ఈ సినిమా ని రిలీజ్ చేయాలనే చిత్ర యూనిట్ చాల వేగంగా పనులని చేస్కుంటూ వెళ్తోంది.

బిగ్ బాస్ షో ఎంత పాపులర్ అయిన షో అనేది మనకందరికి తెలిసిన విషయమే. మన తెలుగు రాష్ట్రము లో కూడా ఈ బిగ్ బాస్ షో చాల పాపులర్ అయింది. అలా 2017 లో జరిగిన బిగ్ బాస్ సీజన్లో కి మన సంపూర్ణేష్ బాబుని అందులో ఒక కంటస్టెంట్ గా తీసుకోవడం జరిగింది.

సంపూర్ణేష్ బాబు అసలు పేరు నరసింహ చారి. అతను ఇండస్ట్రీ లోకి వచ్చినపుడు చాల కష్టపడ్డారు. కానీ, ఆ కష్టం లో నుండే తనకి ఒక కసి పెరిగింది. అలా తనలో ఉన్న నటుడిని “హృదయ కాలేయం” మూవీ ద్వారా మనకి పరిచయం చేసాడు సంపూర్ణేష్ బాబు.

అలా తన సినీ జీవితాన్ని ప్రారంభించారు సంపూర్ణేష్ బాబు గారు.

ఏది ఏమైనప్పటికి ప్రతి ఒక్కరిలోనూ ఒక టాలెంట్ ఉంటుందని మనకి తెల్సు. దాన్ని బైటకి తీసి అందులో సక్సెస్ అవ్వాలని చూపించారు మన బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు.

Check Also

khiladi | movieif

మాస్ మహారాజా రవి తేజ యొక్క “ఖిలాడి” మూవీ టీజర్ విడుదలైంది.

టాలీవుడ్ హీరోలలో మాస్ అనే పేరు చెప్పగానే గుర్తుకు వచ్చే హీరో రవితేజ. రవి తేజ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి …