Breaking News
Home / సినిమా గ్యాలరీ / టాలీవుడ్ స్మైలింగ్ క్వీన్ సమంత అక్కినేని లేటెస్ట్ ఫోటోలు
Samantha| Latest Photos|

టాలీవుడ్ స్మైలింగ్ క్వీన్ సమంత అక్కినేని లేటెస్ట్ ఫోటోలు

Samantha| Latest photos|
Samantha| movieif|

సమంత అక్కినేని ఇది అందరికీ తెలిసిన పేరు. కానీ ఈ ముద్దుగుమ్మ అసలు పేరు “సమంత రుతు ప్రభు”. సమంత ఒక సినీ నటి. తెలుగు మరియు తమిళం రెండు  సినీ ఇండస్ట్రీలో పనిచేస్తోంది. తమిళనాడు లోని మద్రాసులో లో ఏప్రిల్ 28న 1987వ సంవత్సరం లో ఈమె జన్మించింది. తెలుగు తండ్రి, ప్రభు మరియు మలయాళీ తల్లి, కేరళలోని అలప్పుజ నుండి నినెట్.  ఆమె తమిళనాడులోని చెన్నైలోని పల్లవరం లో ప్రభు మరియు నినెట్ మరియు ఇద్దరు అన్నలు జోనాథన్ మరియు డేవిడ్ లకు చిన్న పిల్లవాడిగా పెరిగారు, అదే సమయంలో తమిళ భాషలో మంచి ప్రావీణ్యం ఉన్నవారు.

Samantha| Latest Photos|
Samantha| movieif|

మద్రాస్ లోని “స్టెల్లా మేరీస్ కాలేజ్” లో డిగ్రీ చదివే అండర్ గ్రాడ్యుయేట్ గా, మోడలింగ్ పనులపై పార్ట్ టైమ్ పనిచేశారు.అప్పుడే ఈ ముద్దుగుమ్మ కి నటన పై ఎంత ఆసక్తి ఉందొ అర్ధం అవుతోంది. అతి త్వరలోనే సినీ ఇండస్ట్రీ లో తనకు అవకాశం రావడం మొదలయ్యాయి. 2010 సంవత్సరం లో తెలుగు లో ప్రముఖ దర్శకుడు  “గౌతమ్ మీనన్ ” తన సినిమాలో సమంత కు మొదటి అవకాశం కల్పించారు. ఈ  సినిమా నే “ఏ మాయ చేసావే”.

 

ఈ సినిమాతో మంచి హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది.అప్పట్లో ఈ సినిమా యువకులను బాగా ఆకట్టుకుంది. సమంత ఈ సినిమా తో “ఉత్తమ నటి” గా ఫిలింఫేర్ అవార్డు మరి నంది అవార్డు తన సొంతం చేసుకుంది. 2010 లో అక్కినేని నాగార్జున కొడుకు అక్కినేని నాగచైతన్య తో డేటింగ్ లో ఉంది సమంత. 2017 జనవరి లో నాగచైతన్య మరియు సమంత కు హైదరాబాద్ లో  నిశ్చితార్థం జరిగింది. 2017 అక్టోబర్ 6న హిందు సాంప్రదాయ ఆచారం ప్రకారం అక్టోబర్ 7న క్రిస్టియన్ ఆచారాలు ప్రకారం గోవా లో ఈ జంట కు వివాహం జరిగింది.
Samantha Akkineni| Latest Photos|
Samantha| movieif|
ఆమె ప్రధానంగా తెలుగు మరియు తమిళ చిత్రాలలో ప్రముఖ మహిళా పాత్రలో కనిపించడం ద్వారా బాక్స్ ఆఫీస్ విజయాన్ని సాధించింది. తన నటనా వృత్తి లో నే కాకుండా సెలబ్రిటీ గా ప్రముఖ బ్రాండ్స్ కి అంబాసిడర్ గా పనిచేసింది.
2012 లో మహిళలు మరియు పిల్లలకు వైద్య సహాయం అందించడానికి ఆమె తన సొంత NGO  “ప్రత్యూష సపోర్ట్ “ను ప్రారంభించింది. అదే సంవత్సరం లో తన అనారోగ్యం కారణంగా రెండు నెలలు సినిమా ప్రాజెక్టులకు విరామం తీసుకుంది. ఆమె రోగనిరోధక శక్తి లోపం వల్ల ఆమె శరీరం మందులకు సరిగ్గా స్పందించకపోవటం వల్ల పెద్ద ఎదురుదెబ్బ తగలడం జరిగింది.
తెలుగు లో సూపర్ స్టార్ మహేష్ బాబు తో “దూకుడు” చిత్రం చేసింది. యంగ్ టైగర్ Jr.NTR తో “బృందావనం”, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో “అత్తారింటికి దారేది ” సినిమా చేసింది. ఈ సినిమాలు తెలుగు లో మంచి  సూపర్ హిట్ విజయాలు సాధించాయి.
ఇంకా  సమంత అక్కినేని తెలుగు లో చేసిన సినిమాలు ఇవి:-
1. ఏ మాయ చేసావే
2. బృందావనం
3.  దూకుడు
4. ఈగ
5. ఎటో వెళ్లిపోయింది మనసు
6. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు
7. జబర్దస్త్
8. అత్తారింటికి దారేది
9. రామయ్య వస్తావయ్యా
10. ఆటోనగర్ సూర్య
11. అల్లుడు శ్రీను
12. రభస
13. S/o సత్యమూర్తి
14. బ్రహ్మోత్సవం
15. అ ఆ
16. జనతా గ్యారేజ్
17. రాజు గారి గది 2
18. రంగస్థలం
19. మహానటి
20. U టర్న్
21. మజిలీ
22. ఓ బేబీ
23. జాను
24.మనం
Samantha|Latest photos|
Samantha|movieif|
సమంత అక్కినేని తమిళంలో చేసిన సినిమాలు :-
1. విన్నైతాండి వరువాయ
2. బాణా కాతడి
3. మాస్కోఇన్ కావేరీ
4. నడునిసి నాయిగాళ్
5. నాన్ ఈ
6. నీతానే ఎన్ పొన్ వసంతం
7. తీయ వెలయ్ సెయ్యనుమ్ కుమారు
8. అంజాన్
9. కత్తి
10. 10 ఎండ్రతుకుల్లా
11. తంగమగన్
12. బెంగళూర్ నాత్కల్
13. తెరి
14. 24
15.మెర్సల్
16. ఇరుoబు తిరాల్
17. సీమరాజ
18. సూపర్ డీలక్స్
19. కాతు వాకుల రెండు కాదల్.