Breaking News
Home / సినిమా గ్యాలరీ / బాలీవుడ్ సుప్రీం నటి “అలియా భట్” తాజా ఫోటోలు
alia bhatt | movieif

బాలీవుడ్ సుప్రీం నటి “అలియా భట్” తాజా ఫోటోలు

SS రాజమౌళి ఒక మల్టీ స్టార్రర్ చిత్రం తీయబోతున్నారు. అదే అంతారు ఎదురు చూస్తున్న RRR మూవీ. ఈ RRR మూవీ లో రామ్ చరణ్ మరియు జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటించబోతున్నారు. రామ్ చరణ్ అల్లూరి సీతా రామ రాజు గాను అలాగే జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీం గాను తమ పాత్రలని పోషించబోతున్నారు.

అల్లూరి సీత రామ రాజు పాత్ర కోసం చిరంజీవి వారసుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎంతలా కష్టపడ్డారో మనమందరం చూసాం. ఆ అల్లూరి సీతా రామ రాజు సరసన నటించడానికి ఒక బాలీవుడ్ హీరోయిన్ ని తీసుకోవడం జరిగింది. ఆమె పేరే అలియా భట్.

అలియా భట్ మార్చి 15, 1993 లో జన్మించారు. ఆమె స్వతహాగా ఒక గాయని. అలాగే బాలీవుడ్ (హిందీ చిత్ర పరిశ్రమ) లో ఎంతో పేరు గాంచిన ఒక హీరోయిన్. ఆమె తీసుకునే పారితోషికం కూడా చాల ఎక్కువగానే ఉంటుంది.

alia bhatt | movieif

కరన్ జోహార్ దర్శకత్వం లో 2012 లో వచ్చిన ” స్టూడెంట్ అఫ్ ది ఇయర్ ” మూవీ ద్వారా బాలీవుడ్ ( హిందీ చిత్ర పరిశ్రమ ) లో తెరంగ్రేటం చేశారు అలియా భట్. 1999 లో అలియా భట్ తండ్రి మహేష్ భట్ తీసిన థ్రిల్లర్ చిత్రం “సంఘర్ష్” లో బాల నటుడిగా నటించడం జరిగింది.

అలియా భట్ తండ్రి మహేష్ భట్ మరియు తల్లి రజ్దాన్. ఆమెకి ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు. ఒకరు షాహీన్ మరియు పూజ భట్. మరియు ఒక బ్రదర్ కూడా ఉన్నారు. అతని పేరు రాహుల్ భట్.

తన బ్యూటీ తో కుర్ర వాళ్ళని మతెక్కించిన ఒక బాలీవుడ్ హీరోయిన్ మన అలియా భట్. ఇప్పటికి కూడా చాల మంది కుర్ర వాళ్ళకి ఆమె ఒక కలల రాణి. 2019 లో అత్యధిక పారితోషికం తీసుకున్న హీరోయిన్ గా గుర్తింపు పొందారు అలియా భట్.

alia latest pic | movieif

అలాంటి అలియా భట్ తన సినీ ప్రయాణాన్ని ప్రస్తుతం టాలీవుడ్ (తెలుగు చిత్ర పరిశ్రమ) లో కూడా మొదలు పెట్టబోతున్నారు.

ఆమె వేసే తొలి మూవీ నే టాలీవుడ్ లో ప్రభంజనంలా ఉండాలని అలియా భట్ భావించారు. అనుకున్నదే తడవుగా SS రాజమౌళి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించబోతున్న మల్టీ స్టార్రర్ చిత్రం RRR లో అల్లూరి సీతా రామ రాజు గా చేయబోతున్న రామ్ చరణ్ సరసన సీత అనే పేరుతో అలియా భట్ నటించనున్నారు.

భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ RRR మూవీ కి చాల మొత్తంలో డబ్బు ఖర్చు అయింది. అయినా కూడా వెనక్కి తగ్గకుండా ఎంతో శ్రద్ధతో రాజమౌళి గారు ఈ మూవీ ని తీస్తూ ఉన్నారు.

alia bhatt | movieif

ఈ మూవీ కి నిర్మాతగా DVV దానయ్య వ్యవహరిస్తున్నారు. అలాగే సంగీత మాంత్రికుడు కీరవాణి తన సంగీతాన్ని అందించబోతున్నారు ఈ RRR మూవీకి.

కొమరం భీం గా నటించ బోతున్న జూనియర్ ఎన్టీఆర్ సరసన ఒలీవియా మోరిస్ అనే ఒక హాలీవుడ్ హీరోయిన్ నటించబోతున్నారు. ఈ RRR మూవీ కోసం జూనియర్ ఎన్టీఆర్ చేత నిజమైన పులితో ఫైట్ చేయించారు రాజమౌళి గారు.

ఇలాంటి షాకింగ్ కి గురిచేసే అంశాలు ఈ RRR మూవీ లో ఉన్నందున ఈ మూవీ పైన భారీ అంచనాలు ఉన్నాయి.