Breaking News
Home / సినిమా గ్యాలరీ / ఉప్పెన మూవీలో నటించిన “క్రితి శెట్టి” లేటెస్ట్ ఫొటోస్ ఇపుడే చూడండి
latest photos of krithi | movieif

ఉప్పెన మూవీలో నటించిన “క్రితి శెట్టి” లేటెస్ట్ ఫొటోస్ ఇపుడే చూడండి

“ఉప్పెన” సినిమా ద్వారా టాలీవుడ్ కి అలాగే తెలుగు ప్రేక్షకుల కి అమితంగా నచ్చడమే కాకుండా వారిని అత్యంత ఎక్కువగా ఆకర్షించిన హీరోయిన్ క్రితి శెట్టి.

ktirhi shetty | movieif

అలా “ఉప్పెన” మూవీ తో తెలుగు తెర కి పరిచయమయి అతి తక్కువ కాలం లోనే చాల మంది అభిమానుల ని సొంతం చేసుకున్నారు క్రితి శెట్టి.

krithi | movieif

దేవిశ్రీ ప్రసాద్ సంగీతం లో పంజా వైష్ణవ తేజ్ మరియు క్రితి శెట్టి జంట గా కలిసి నటించిన చిత్రం “ఉప్పెన”. ఈ సినిమా కి బుచ్చి బాబు దర్శకత్వం వహిస్తున్నారు. బుచ్చిబాబుకి ఇదే తన మొదటి సినిమా. ఈ సినిమా లో తమిళ్ స్టార్ విజయ్ సేతుపతి తన నటనతో ప్రేక్షకులని విశేషంగా ఆకట్టుకున్నారు. బుచ్చి బాబుకి సుకుమార్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన అనుభవం ఉంది. సుకుమార్ మరియు మైత్రి మూవీ మేకర్స్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

krithi shetty | movieif

“ఉప్పెన” సినిమాలో తన నటన తో విమర్శకులని కూడా తనని పొగిడేలా చేసుకున్న ఏకైక హీరోయిన్ క్రితి శెట్టి. ఆమె నటనకి వందకి వంద మార్కులు వేయడానికి ప్రేక్షకులు ఏమాత్రం వెనుకాడలేదు అనడంలో ఎలాంటి సందేహం లేదు.

krithi | movieif

క్రితి శెట్టి తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్. తన తో పాటు నటించిన వారికి కూడా తన లాగే గుర్తింపు వస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

krithi shetty | movieif

తన అందంతో కుర్ర వాళ్ళని ఒక్క ఊపు ఊపేసింది క్రితి శెట్టి. కుటుంబ ప్రేక్షకులకి కూడా తన వస్త్రధారణతో తెలుగింటి ఆడపడుచులా కనిపించారు క్రితి శెట్టి. ఒకే ఒక్క మూవీ తో తన కెరీర్ నే మార్చేసుకున్నారు క్రితి శెట్టి.

krithi shetty | movieif

ఈ అమ్మాయిని చుసిన వారంతా కూడా తన వయసు తెలుసుకుని ఆశ్చర్యపోయారు. ఎందుకంటే తాను 2020 లో విడుదల అయిన “ఉప్పెన” సినిమా చేస్తున్నపుడు తన వయసు కేవలం 14 సంవత్సరాలు. అంత చిన్న వయసులోనే ఇంత అందంగా మరియు సినిమాలో అవకాశం రావడం అందరిని సంబ్రమాశ్చర్యంలో ముంచెత్తినది.

krithi | movieif

“ఉప్పెన ” మూవీ తర్వాత క్రితి శెట్టి కి అనేక భాషల నుండి మూవీస్ తీయడానికి అవకాశాలు రావడం జరిగింది. వాటిలో కొన్ని సినిమాలు ఇపుడు సెట్స్ మీద ఉన్నాయి.

క్రితి శెట్టి, చేయబోతున్న సినిమాలు :

1. సినిమా పేరు: శ్యామ్ సింగరాయ్
నటీనటులు : నాని, సాయి పల్లవి, క్రితి శెట్టి
దర్శకుడు : రాహుల్ సాంకృత్యాన్
నిర్మాత : బోయినపల్లి వెంకట్
సంగీతం : మిక్కీ జే. మేయర్
భాష : తెలుగు

2. సినిమా పేరు: రాపో 19
నటీనటులు : రామ్ పోతినేని, క్రితి శెట్టి
దర్శకుడు : ఎన్. లింగు స్వామి
నిర్మాత : శ్రీనివాస చిట్టూరి.
భాష : తెలుగు

3. సినిమా పేరు: “ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి”
నటీనటులు : సుధీర్ బాబు, క్రితి శెట్టి
దర్శకుడు : మోహన్ కృష్ణ ఇంద్ర గంటి
నిర్మాత : మహేంద్ర బాబు బి, కిరణ్ బళ్ళపల్లి
సంగీతం : వివేక్ సాగర్
భాష : తెలుగు