Breaking News
Home / సినిమా ట్రైలరు / MORTAL COMBAT ట్రైలర్ ని ఇపుడే చూడండి
mortal combat movie trailer

MORTAL COMBAT ట్రైలర్ ని ఇపుడే చూడండి

అమెరికన్స్ మార్షల్ ఆర్ట్స్ ఆధారంగా తెరకెక్కబోతున్న ఫాంటసీ యాక్షన్ చిత్రంగా MORTAL COMBAT చిత్రం రాబోతోంది. గ్రెగ్ రుస్సో మరియు డేవ్ కెల్లహం స్క్రీన్ప్లే లో రాబోతున్న ఈ MORTAL COMBAT మూవీ కథను ఉజిఎల్ మరియు రుస్సో రాయడం జరిగింది.

వార్నర్ బ్రదర్స్ నిర్మిస్తున్నటువంటి ఈ చిత్రం ఎంతో చిత్రమైన విన్యాసాలతో సాగుతుంది. ఎన్నో సాహస కలాపాలతో సాగే ఈ మూవీని హిందీ, తెలుగు మరియు తమిళ్ లో తీస్కుని రాబోతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా HBO MAX స్ట్రీమింగ్ ద్వారా మరియు థియేటర్స్ లో వార్నేర్స్ బ్రదర్స్ పిక్చర్స్ ద్వారా ఏప్రిల్ 23న 2021 న విడుదల కాబోతోంది.

జేమ్స్ కామెరాన్ దర్శకత్వం వహించినటువంటి అవతార్ మూవీ ప్రపంచంలో అత్యుత్తమమైన చిత్రంగా నిలిచిన సంగతి అందరికీ తెలిసిందే.

ఈ చిత్రం కంటే ముందుగా మరొక చిత్రం ప్రపంచ బాక్స్ ఆఫీస్ దగ్గర తన సత్తా చాటింది. అదే అవెంజర్స్: ఎండ్ గేమ్ మూవీ.

ఈ అవెంజర్స్: ఎండ్ గేమ్ మూవీ ని మర్వెల్ సంస్థ నిర్మించింది. ఈ చిత్రం కోసం ప్రపంచం మొత్తం ఎదురు చూసింది అని చెప్పడంలో
ఎలాంటి సందేహం లేదు.

ఇపుడు ఈ అవతార్ మరియు అవెంజర్స్ మూవీస్ గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే చైనా వాళ్లు తీయబోతున్న ఈ MORTAL COMBAT మూవీ ని వీటికి పోటిగా తీసుకుని రాబోతున్నట్టు మనకి అర్థం అవుతోంది. ముఖ్యంగా అవెంజర్స్ మూవీలో సూపర్ హీరోస్ లాగ ఇందులో కూడా చాలా మంది సూపర్ పవర్స్ కలిగిన వ్యక్తులు ఉండటం మనం MORTAL COMBAT ట్రైలర్ లో గమనించవచ్చు.

ఈ MORTAL COMBAT మూవీ మొత్తం ఒక గేమ్ లాగ ఉండబోతుందని మనకి చెప్తున్నారు. గేమ్ లోని పాత్రలలాగా ఇక్కడ కూడా విచిత్రమైన
వేషధారణతో పాటు రకరకాల శక్తులతో మనం కనివిని ఎరుగని రీతిలో గ్రాఫిక్స్ ఉండబోతున్నాయని చిత్రం యూనిట్ మనకి చెప్తోంది.

మొదటగా రెండు సార్లు ఈ మూవీ ని తీయాలని ప్రయత్నించి సాధ్యం అవ్వక వదిలేసారు. కానీ ఈసారి వార్నర్ బ్రదర్స్ సంస్థ ఈ మూవీ
తీయడానికి ముందుకి రావడంతో మల్లి ఈ మూవీ షెడ్యూల్ స్టార్ట్ అయ్యింది. ఏది ఏమైనప్పటికి ఒక కొత్త రకమైన విన్యాసాలతో ఈ MORTAL
COMBAT మూవీ మన ముందుకి రాబోతోంది. మనం గమనిస్తే ఇలాంటి గేమింగ్ మూవీస్ మనం ఆల్రెడీ చూసాం అవేంటంటే జ్యూమంజి మూవీ
సిరీస్ అలాగే జతుర ఇలా కొన్ని మూవీస్ ముందుగానే మనకి తెలుసు. ఇపుడు అదే కాన్సెప్ట్ ద్వారా మన ముందుకి ఈ MORTAL COMBAT
మూవీ రాబోతోంది.
ఈ మూవీ లోని విన్యాసాలని మనం ట్రైలర్ లో గమనించవచ్చు. కావాలంటే ఇక్కడే మీరు ట్రైలర్ ని చూసి తెల్సుకోవచ్చు. ఎంత భారీగా
సెట్స్ వేసారో అలాగే ఎఫెక్ట్స్ ఎలా ఉపయోగించారో మనకి అర్థమవుతుంది. ఇలాంటి మూవీస్ చూడటానికే ఈ కాలం పిల్లలు కానీ పెద్దవాళ్ళు
కానీ ఇష్టపడతారు అనడంలో ఎలాంటి సందేహం లేదు.

Check Also

balck widow | movieif

SCARLETT JOHANSSON యొక్క “బ్లాక్ విడో” అధికారిక ట్రైలర్

బ్లాక్ విడో మార్వెల్ సినిమాల గొప్ప మహిళా యోధురాలు. సినిమాల్లో ఆమె పేరు నటాలియా రోమనోఫ్. ఆమె గురించి ఒక …